సమన్వయంతో ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో ప్రమాదాల నివారణ

Feb 26 2026 8:33 AM | Updated on Feb 26 2026 8:33 AM

సమన్వయంతో ప్రమాదాల నివారణ

సమన్వయంతో ప్రమాదాల నివారణ

● ఎస్పీ నితిక పంత్‌

వాంకిడి: పోలీస్‌ శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. వాంకిడి మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఇందాని, గణేష్‌పూర్‌, సోనాపూర్‌, ఖమాన ఎక్స్‌రోడ్‌పై బ్లాక్‌ స్పాట్‌లను బుధవారం పరిశీలించారు. పోలీస్‌ అధికారులు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు సూచనలు చేశారు. ప్రమాదాల నివారణకు మరింత అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో స్పష్టమైన సైన్‌ బోర్డులు, సోలార్‌ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో రోడ్‌ బంబ్స్‌, భద్రత సూచికలు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌ లిమిట్‌, రిఫ్లెక్టివ్‌ మార్కింగ్స్‌ వంటివి సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. వాహనదారులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు అవగాహన పెంపొందించడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్‌, వాంకిడి సీఐ సత్యనారాయణ, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌, ఎస్సై మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement