అంబులెన్స్ పైలెట్లకు పురస్కారాలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని లింగాపూర్, సిర్పూర్(యు), జైనూర్ మండల కేంద్రాల్లో 108, 102 అంబులెన్స్ పైలెట్లుగా విధులు నిర్వర్తిస్తున్న రాథోడ్ జగదీష్, జ్ఞానేశ్వర్, రవి, గజానంద్‌లకు జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ స్టార్ పైలెట్ పురస్కారాలు ప్రదానం చేసింది. ఆరు నెలలుగా అత్యవసర సేవల్లో నిబద్ధతతో పనిచేస్తూ సమయానికి రోగులను ఆస్పత్రులకు తరలించడం, అనేక ప్రాణాలను కాపాడినందుకు వీరి సేవలను గుర్తించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉత్తమ ఉద్యోగులను అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం కలెక్టర్ కె.హరిత, డీఎంహెచ్‌వో సీతారాం పురస్కారాలు ప్రదానం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 108 సేవల నిర్వాహకుడు సామ్రాట్, జిల్లా నిర్వాహకుడు మెరుగు నరేశ్ యాదవ్ పాల్గొన్నారు.


