హెల్మెట్ ధరించకపోతే ప్రాణాలకే ముప్పు
వాంకిడి: హెల్మెట్ ధరించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారలో మంగళవారం ‘అరైవ్–అలైవ్’కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం హెల్మెట్ ధరించకపోవడంతోనే ప్రాణనష్టం జరుగుతుందన్నారు. అతి వేగం, మద్యం సేవించి రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో హెల్మెట్‌లేని కారణంగా బెండార గ్రామానికి చెందిన నగోషే పెంటు మృతి చెందగా.. ప్రస్తుతం పెద్దదిక్కు లేని అతని కుటుంబ సభ్యుల పరిస్థితిని ప్రజలకు వివరించారు. బాధిత కుటుంబ సభ్యుల చేతుల మీదుగా 25 హెల్మెట్లు పంపిణీ చేశారు. బాధిత కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర స రుకులు అందించారు. సీఐ సత్యనా రాయణ, ఎస్సై మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.


