ఎమ్మెల్యేపై అక్రమ కేసును ఎత్తివేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై అక్రమ కేసును ఎత్తివేయాలి

Feb 25 2026 7:16 AM | Updated on Feb 25 2026 7:16 AM

ఎమ్మెల్యేపై అక్రమ కేసును ఎత్తివేయాలి

ఎమ్మెల్యేపై అక్రమ కేసును ఎత్తివేయాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఆదివాసీ నాయకురాలు, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై పెట్టిన అక్రమ కేసు ను తక్షణమే ఎత్తివేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకురాలు మర్సుకోల సరస్వతి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మంగళవా రం ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్‌ చైర్మ న్‌ ఆకాశ్‌తో కలిసి మాట్లాడారు. అధికార పార్టీ మంత్రి మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్‌లో చై ర్మన్‌ ఎన్నిక జరగకుండా బీఆర్‌ఎస్‌ నాయకులు బా ల్క సుమన్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చే శారని మండిపడ్డారు. కౌన్సిలర్‌ అభ్యర్థులను కా ర్యాలయానికి తీసుకెళ్తున్న కోవ లక్ష్మిపై రామకృష్ణాపూర్‌ పోలీసులు అక్రమంగా కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదివాసీ మహిళపై కేసు ను ఎత్తివేయని పక్షంలో ప్రభుత్వంపై ఉద్యమిస్తామ ని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు వెంకన్న, కుర్సెంగ బాలకృష్ణ, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement