‘కోర్టు స్టేకు కృషి చేస్తా’
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ గుండ స్నేహపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కోర్టు స్టేకు కృషి చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. విప్ ధిక్కరించి బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఆసిఫాబాద్ 13వ వార్డు కౌన్సిలర్ గుండ స్నేహ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి గుండ స్నేహ, శ్యాం దంపతులు సోమవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక పరిస్థితులు వివరించారు. స్పందించిన ఆయన తన వ్యక్తిగత లాయర్‌తో మాట్లాడి వారం రోజుల్లోగా కౌన్సిలర్ రద్దుపై స్టే వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి వెల్లడించారు. వారి వెంట తిర్యాణి మండల నాయకుడు జగదీశ్ ఉన్నారు.


