సీఎం కప్ పోటీల్లో రెండోస్థానం
రెబ్బెన: వనపర్తిలో జరిగిన సెపక్‌తక్రా సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా పురుషుల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించినట్లు సెపక్‌తక్రా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఫైనల్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ పురుషుల జట్టు హైదరాబాద్ జట్టుతో తలపడిందన్నారు. హోరాహోరీగా సాగిన పోటీలో 11– 15, 17– 16, 14– 13 పాయింట్లతో సెట్ పా యింట్ కోల్పోయి వెండి పతకం కై వసం చేసుకోవా ల్సి వచ్చిందన్నారు. క్రీడాకారులను అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, జిల్లా డీవైఎస్‌వో అష్వక్ అహ్మద్, శిరీష, ఎగ్జిక్యూటివ్ సభ్యులు భాస్కర్, రామకృష్ణ, సతీశ్, బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు అభినందించారు.


