పెండింగ్ లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
రెబ్బెన: సింగరేణి ఉద్యోగులకు పెండింగ్ లే కుండా సీఎంపీఎఫ్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎంపీఎఫ్ రీజినల్ కమి షనర్ హరి పచౌరీ తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ప్రయాస్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎంపీఎఫ్ లావాదేవీలు అన్ని సీకేర్స్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతాయన్నారు. ఉద్యోగులు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా సేవలు పొందవచ్చని స్పష్టం చేశారు. సీఎంపీఎఫ్ బెనిఫిట్స్‌కు అర్హులు, పెన్షన్, రివైస్డ్ పెన్షన్‌పై అవగాహన కల్పించారు. ఉద్యోగుల సందేహా లను నివృత్తి చేశారు. నామినీ పేర్లలో వ్య త్యాసం వచ్చిన సందర్భాల్లో ధ్రువీకరించే విధానంపై అవగాహన కల్పించారు. ఈ నెలలో కమిషనర్ పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఇన్‌చార్జి జీఎం నరేందర్, అధికా రులు ఆయనను సన్మానించారు. రీజినల్ కమిషనర్– 2 గోవర్ధన్, డీవైపీఎం ఎస్‌వీ రాజేశ్వర్‌రావు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, ప్రశాంత్, సీఎంపీఎఫ్ ఉద్యోగులు మనోహర్, అనిత, సిబ్బంది పాల్గొన్నారు.


