మట్టిపాత్రల తయారీపై వర్క్‌షాప్
సిర్పూర్(టి): మండలంలోని వేంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మట్టిపాత్రల తయారీ వర్క్‌షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ అధిక వినియోగంతో పర్యావరణ కాలుష్యం పెరుగుతుందన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి మట్టిపాత్రల వినియోగం ఉత్తమమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు మట్టిపాత్రల తయారీపై అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయులు ప్రకాశ్, లక్ష్మీనారాయణ, ఓంప్రకాశ్, శాంతికుమారి, శ్రీనివాస్, సీఆర్‌పీ రమేశ్ పాల్గొన్నారు.


