ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నృత్య శిక్షణ
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆ ధ్వర్యంలో విద్యార్థులకు డ్యాన్స్‌లో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రముఖ డ్యాన్సర్ సుధాకర్ నేతృత్వంలో 15 రోజుల పాటు శాసీ్త్రయ, జానపద విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, అకాడమిక్ కోఆర్డినేటర్ జనార్ధన్, శారద, అధ్యాపకులు రాజేశ్వర్, దేవేందర్, వెంకటేశం పాల్గొన్నారు.


