సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ

Feb 24 2026 7:06 AM | Updated on Feb 24 2026 7:06 AM

సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ

సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ

చింతలమానెపల్లి: మండలంలోని గూడెం గ్రామంలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు భూమిపూజ చేసి ప్రారంభించారు. దిందా, గూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సబ్‌స్టేషన్‌ నిర్మాణంతో గూడెం, పరిసర గ్రామాల్లో లోవోల్టేజీ సమస్యలు తొలగిపోతాయని అన్నారు. బెజ్జూర్‌ నుంచి అహేరి వరకు బస్సులు నడుస్తున్నాయని, చింతలమానెపల్లి, బెజ్జూర్‌ మండల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడిందని పేర్కొన్నారు. బాబాసాగర్‌ నుంచి గూడెం వరకు హ్యామ్‌ పథకం కింద రహదారి మంజూరైందన్నారు. అంతకు ముందు దిందా వంతెన పనులను పరిశీలించి, నాణ్యతగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సునీత అశోక్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ ప్రవీణ్‌, నాయకులు డుబ్బుల నానయ్య, డుబ్బుల వెంకన్న, చౌదరి నానయ్య, చౌదరి రంగయ్య, చౌదరి హరి, సత్పుతె తుకారాం, పవన్‌ పురోహిత్‌, డుబ్బుల రావు, దేశ్‌ముఖ్‌ భద్రేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement