విజేతలకు బహుమతుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

విజేతలకు బహుమతుల ప్రదానం

Feb 22 2026 7:08 AM | Updated on Feb 22 2026 7:08 AM

విజేతలకు బహుమతుల ప్రదానం

విజేతలకు బహుమతుల ప్రదానం

కాగజ్‌నగర్‌ రూరల్‌: మండలంలోని భట్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల బామని చేనులో వారంరోజులుగా నిర్వహిస్తున్న ట్రై విలేజ్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో గెలు పొందిన జట్లకు శనివారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడా పోటీల్లో పాల్గొని రాణించాలని సూచించారు. విన్నర్‌గా నిలిచిన అందవెల్లి, రన్నర్‌గా నిలిచిన భట్‌పల్లి జట్లకు బహుమతులు అందజేశారు. కార్య క్రమంలో నాయకులు పిర్సింగుల తిరుపతి, శ్రీనివాస్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement