వలయం!
సమస్యల
ఆసిఫాబాద్: జిల్లాలోని ఆసిఫా బాద్, కాగజ్‌నగర్ బల్దియాల్లో ఏడాదిగా ప్రత్యేక పా లన కొనసాగింది. పాలకవర్గాలు లేక అభివృద్ధి కుంటుపడింది. నిధుల కొరతతో అధి కారులు పన్నుల వసూళ్లకే పరిమితమయ్యారు. ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా, చైర్మన్, వైస్‌చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు బా ధ్యతలు స్వీకరించారు. కొత్త పాలకవర్గాలపై ఆయా బల్దియాల పరిధిలోని ప్రజలు గంపెడాశతో ఉన్నా రు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లోని 50వార్డుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ము ఖ్యంగా తాగునీరు, పారిశుధ్య సమస్యలతో ప్రజలు చాలా సతమతమవుతున్నారు.
అధ్వానంగా అంతర్గతరోడ్లు
ఆసిఫాబాద్‌లో 20, కాగజ్‌నగర్‌లో 30 వార్డులు న్నాయి. రెండు మున్సిపాలిటీల్లో సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవు. రోడ్లపై మురుగునీరు చేరి దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పైకాజీనగర్, సందీప్‌నగర్, బజార్‌వాడీ, కసాబ్‌వాడీ, బ్రాహ్మణవాడ, గొడవెళ్లి, హీరాపూర్‌తో పాటు పలు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పైకాజీనగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ఏటా వానాకాలంలో ఇళ్లలోకి వర్షపునీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు చౌక్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ మూసుకుపోయింది. ప్రభుత్వాస్పత్రి వద్ద డ్రైనేజీపై టేలాలు ఏర్పాటు చేయడంతో రోడ్లపైకి మురుగునీరు చేరి రాకపోకలకు తీ వ్ర ఇబ్బందులెదురవుతున్నాయి. కాగజ్‌నగర్ ము న్సిపాలిటీలోని మార్కెట్ ఏరియా, కాపువాడ, సంజీవయ్య తదితర కాలనీల్లో డ్రైనేజీలు లేక ఏటా వానాకాలంలో డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరుతోంది. దీంతో పాటు ఇరుకురోడ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీల్లో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. రెగ్యులర్‌గా కాలనీల్లో చెత్తాచెదా రం తొలగించక పోవడంతో రోడ్లపై చెత్త పేరుకుపోతోంది. జెడ్పీ గ్రౌండ్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌గా మారడంతో విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు.
కోతులు, కుక్కలు, పందులు..
జిల్లా కేంద్రంలో కోతులు, కుక్కలు, పందుల బెడద ప్రధాన సమస్యగా మారింది. కోతులు నిత్యం ఇళ్లలోకి ప్రవేశించి మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఇళ్లలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై విచ్చలవిడిగా కుక్కలు, పందులు సంచరిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో నిర్మించిన శ్మశా న వాటికకు రహదారి లేక ఇప్పటివరకు వినియోగంలోకి రాలేదు. ఎవరైనా చనిపోతే వారి మృతదేహాలను పెద్దవాగు పక్కనే దహనం చేస్తున్నారు. కొ త్త పాలకవర్గాలు, అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయా మున్సిపాలిటీల పరిధిలో ని ప్రజలు కోరుతున్నారు.
తాగునీటి కటకట
జిల్లా కేంద్రంలో మిషన్‌భగీరథ ద్వారా రూ.కోట్లతో పైపులైన్ నిర్మాణం చేపట్టినప్పటికీ సరైన ప్రణాళిక, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఎక్కడ చూసినా లీకేజీ లతో పాటు కాలనీల్లో చుక్క నీరు రాని పరి స్థితి నెలకొంది. ఏటా వేసవిలో చేతిపంపుల ను ఆశ్రయిస్తున్నారు. నల్లాలకు తూటీలు ఏ ర్పాటు చేయకపోవడంతో కొన్ని కాలనీల్లో నీరు వృథాగా పోతోంది. పట్టణంలోని శివకేశవ మందిర్ వీధి, తారకరామానగర్‌తోపాటు పలు కాలనీల్లో నల్లాల ద్వారా భగీరథ నీరు అందని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు డబ్బులు వెచ్చించి ప్రైవేట్ వాటర్‌ప్లాంట్ల నుంచి తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పా టించడం లేదు. సీసీ రోడ్లు వేసిన నెలలోనే కంకర తేలుతూ పాడవుతున్నాయి.
తప్పని ట్రాఫిక్ తిప్పలు
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పట్టణంలోని గాంధీచౌక్, వివేకా నంద చౌక్, అంబేడ్కర్ చౌక్ ప్రాంతాల్లో పా ర్కింగ్ సౌకర్యం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. ఎస్‌బీఐ బ్రాంచ్ వద్ద రోడ్లపైనే ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తుండగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ప్రధాన మార్కెట్‌లో రోడ్లపైనే తోపుడు బండ్లపై పండ్లు విక్రయిస్తున్నారు. వివేకానంద చౌక్‌లో ఐ కేపీ ఆధ్వర్యంలో పాల విక్రయ కేంద్రం కో సం ఓ టేలా ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యల కు కారణమవుతున్నారు. రోడ్లపై చిరువ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేయడంతో ట్రా ఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడుతోంది. జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు చౌక్, సాయిబాబా మందిర్‌కు వెళ్లే రహదారికి సీసీకి అప్రోచ్‌రోడ్ లేక వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వలయం!
వలయం!


