అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Feb 22 2026 7:08 AM | Updated on Feb 22 2026 7:08 AM

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

● కలెక్టర్‌ కే హరిత ● అభివృద్ధిపై సమీక్ష

ఆసిఫాబాద్‌: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ కే హరిత సూచించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదన పు కలెక్టర్‌ దీపక్‌తివారితోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనున్నందున పనులు వేగవంతం చేయాలని తెలిపారు. పూర్తయిన పనుల బిల్లుల ప్రతిపాదనలు అందించాలని సూచించారు. సంబంధిత అధికారులు, ఇంజినీర్లు, ఎంపీడీవోలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామీణ ఉపాధి పథకం కింద మంజూరైన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలు, గ్రామ సమాఖ్య భవనాలు, ఫుడ్‌ గ్రెయిన్‌ గోదాం, వంటశాలల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించా రు. ఇంజినీరింగ్‌ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాలల అదనపు తరగతి గదులు, రహదారి పనులు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణాలు, బీటీ రహదారుల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. సంపూర్ణత అభియాన్‌, ప్రధానమంత్రి జన్‌మన్‌ కింద చేపట్టిన పనులు పూర్తి చే యాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పీవీ టీజీ అవాసాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని తెలిపారు. పాఠశాలల్లో చేపట్టిన బాలికల ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూ చించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని, అవసరమైన మరమ్మతు చర్యలు చేపట్టాలని తెలి పారు. లింగాపూర్‌, సిర్‌పూర్‌ (యూ), తిర్యాణి మండలాల్లోని మారుమూల గిరిజన గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్‌ అధికారులు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని పేర్కొన్నారు. ఇంకా ప్రారంభం కానివి ఉంటే లబ్ధి దారులతో మాట్లాడి త్వరగా నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం కింద చేపట్టిన పనులను మార్చి 31లోపు పూర్తి చేయించి బిల్లులు చెల్లించాలని సూచించారు. అనంతరం మండలాల వారీగా పనుల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో వివిధ శాఖల అధికా రులు, ఇంజినీర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement