హాజీపూర్ ఉప సర్పంచ్ రాజీనామా
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ దానయ్య తన ఉపసర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఎంపీడీఓ సాయివెంకటరెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. ఈ నెల 11న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం వార్డు సభ్యుల అంగీకారంతో ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఏం జరిగిందో గానీ రాజీమానా చేయగా.. ఇంకా ఆమోదం కాలేదు. సోమవారం పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఉప సర్పంచ్‌గా దానయ్య ప్రమాణ స్వీకారం చేయాలని అధికారులు అంటున్నారు. ప్రమాణ స్వీకారం చేయకముందే రాజీనామా చేసే అవకాశం లేదని, ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లిన మీదట రాజీనామా ఆమోదించి ఆ తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఉప సర్పంచ్ అభ్యర్థి ఎన్ని క ఉంటుందని చెబుతున్నారు.
ఆటో బోల్తా.. విద్యార్థులకు గాయాలు
కుంటాల: మండలంలోని కల్లూరు –కుంటాల రహదారిపై శనివారం సాయంత్రం ఆదర్శ పా ఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడడంతో వారికి గాయాలయ్యాయి. స్థానిక ఆ దర్శ పాఠశాల నుంచి ఓ ఆటోలో 12 మంది వి ద్యార్థులు కల్లూరు వెళ్తుండగా వెంకూర్ స మీపంలో బోల్తాపడింది. నర్సాపూర్ (జి) మండలంలోని బూర్గుపల్లి (కె) గ్రామానికి చెందిన జాదవ్ అక్షర, వైష్విక, చాక్‌పెల్లి గ్రామానికి చెందిన రశ్మిత, కుంటాల మండలంలోని అందకూర్ గ్రామానికి చెందిన పడకంటి స్వాతికి గా యాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో వారిని చికిత్స నిమిత్తం భైంసా, కల్లూరు తరలించారు. ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు సాయపడ్డారు.
కనిపించకుండా పోయి.. శవమై తేలి
బోథ్: సొనాల మండల కేంద్రానికి చెందిన పంచాయతీ కా ర్మికుడు బత్తుల రాము(38) గ త మూడు రోజులుగా కనిపించకుండా పోయాడు. కాగా శనివారం రాత్రి సొనాల గ్రామ డంపింగ్ యార్డు వద్ద శవమై కనిపించాడు. పక్కనే ఉన్న చెట్టుకు తాడు కట్టి ఉంది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఎస్సై శ్రీసాయి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిఽశీలించారు. పంచనామా నిర్వహించి మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా భార్య బత్తుల రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రశ్మిత
పడకంటి స్వాతి
హాజీపూర్ ఉప సర్పంచ్ రాజీనామా
హాజీపూర్ ఉప సర్పంచ్ రాజీనామా
హాజీపూర్ ఉప సర్పంచ్ రాజీనామా


