సర్పంచ్‌గా ఓడినా హామీ నెరవేర్చారు..
కై లాస్‌నగర్(బేల): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓడినా ప్రజలకు ఇచ్చినా హామీని నెరవేర్చారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సామ రూపేష్‌రెడ్డి పోటీ చేశారు. తనను గెలిపిస్తే బాజీరావు మహరాజ్ ఆలయం వద్ద బోరు వేయిస్తానని హామీనిచ్చారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్‌రెడ్డి సహకారంతో ఆలయం వద్ద శనివారం బోరు వేయించారు. ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్‌తో కలిసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బెదుర్కర్ రవీందర్ పటేల్, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు వినోద్, మంచికంటి సాయి, ఊషన్న, సతీష్, సునిల్ పాల్గొన్నారు.
కొత్తూరులో..
నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి మహ్మద్ జలీల్ ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయారు. భీరన్న దేవుడి గుడి నిర్మాణం కోసం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు విలువ చేసే మెటీరియల్ అందజేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
సర్పంచ్‌గా ఓడినా హామీ నెరవేర్చారు..
సర్పంచ్‌గా ఓడినా హామీ నెరవేర్చారు..


