నాణ్యమైన విద్యుత్ సరఫరా
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎన్‌పీడీసీఎల్ సంచాలకుడు (ఆపరేషన్) మధుసూదన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సీఈ అశోక్ కుమార్, ఆసిఫాబాద్ ఎస్‌ఈ ఉత్తం జాడేతో కలిసి జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ లైన్ల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరగా మంజూరు చేయాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఏవో దేవిదాస్, డీఈఈలు నాగరాజు, వీరేశం, ఏడీఈలు శ్రీనివాస్, ఇర్ఫాన్ అహ్మద్, రాజేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


