మంచు దుప్పటి
పొగమంచుతో ఊటిని తలపిస్తున్న తిర్యాణి
దహెగాంలో స్వెట్టర్లతో విద్యార్థులు
లింగాపూర్‌లో కమ్ముకున్న పొగమంచు
లింగాపూర్‌లో చలిలో
తాగునీటిని తెచ్చుకుంటున్న రైతులు
దట్టమైన అటవీ ప్రాంతాలు, వాగులు, ఒర్రెలతో నిండి ఉన్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచుదుప్పటి కప్పుకుంది. ఈ ఏడాది రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి. చిన్నారులు, వృద్ధులతోపాటు రైతులు, కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిరోజులు తీవ్రమైన పొగమంచు కురుస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతాలు ఊటిని తలపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకే వణుకు మొదలవుతుండగా, ఉదయం 10 దాటినా పొగమంచు ప్రభావం వీడటం లేదు. శుక్రవారం సిర్పూర్(యూ) మండల కేంద్రంలో రాష్ట్రంలోనే రెండో అత్యల్పంగా 6.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. తిర్యాణి మండలం గిన్నెధరిలో 6.6, తిర్యాణిలో 7.6, కెరమెరిలో 7.9, వాంకిడి, ఆసిఫాబాద్, చింతలమానెపల్లిలో 9.4, పెంచికల్‌పేట్‌లో 9.7 డిగ్రీలుగా నమోదైంది. గురువారం సైతం సిర్పూర్(యూ)లో 5.7, గిన్నెధరిలో 6.4 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
– తిర్యాణి/లింగాపూర్/దహెగాం
మంచు దుప్పటి
మంచు దుప్పటి
మంచు దుప్పటి
మంచు దుప్పటి
మంచు దుప్పటి
మంచు దుప్పటి


