రక్షణ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రకృతి విపత్తుల సమయంలో రక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికా రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో రక్షణ చర్యల ప్రణాళికల రూపకల్పనపై సమీక్షించారు. ఆ యన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణ, ప్రజారక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు, వరదలతోపాటు పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల్లో ప్ర జలను రక్షించేందుకు ప్రణాళికలు రూపొందించుకో వాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ ప్రజలకు పునరావాసం కల్పించడం, తక్షణ వైద్యసేవలు అందించడం, ఇతర అంశాల నిర్వహణ కోసం నోడల్ అధి కారులను నియమిస్తున్నామని తెలిపారు. జాతీయ విపత్తు రక్షణ బృందం, రాష్ట్ర విపత్తు రక్షణ బృందా ల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవి డ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతిగౌడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2,674 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనం అందిస్తుందని తెలిపారు. ఈ నెల 23లోగా పోర్టల్‌లో వారి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.


