‘సమస్యలు పరిష్కరించకుంటే సర్వేలు బంద్’
ఆసిఫాబాద్‌అర్బన్: ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించకుంటే సర్వేలు బంద్ చేస్తామని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అ ధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆశవర్కర్లతో కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆమె మాట్లాడుతూ ఈ నెల 18న ప్రారంభమైన లెప్రసీ సర్వేకు అదనంగా డ బ్బులు చెల్లించాలని, గతంలో పెండింగ్‌లో ఉ న్న లెప్రసీ, పల్స్‌పోలియో, ఎలక్షన్ డ్యూటీల డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డీఎంహెచ్‌వో బయటకు రావాలని నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న డీఎంహెచ్‌వో సీతారాం మాట్లాడుతూ తన ఆధీనంలో ఉన్న డిమాండ్లు నెరవేరుస్తానని, సర్క్యులర్ కూడా జారీ చేస్తానని హామీ ఇచ్చారు. మిగితా సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు త్రివే ణి, కార్యదర్శి రాజేందర్, నాయకులు కృష్ణమాచారి, శ్రీకాంత్, స్వరూప, భారతి, ప్రమీ ల, అనసూర్య, లక్ష్మి, సులోచన పాల్గొన్నారు.


