హాజరు అంతంతే..! | - | Sakshi
Sakshi News home page

హాజరు అంతంతే..!

Oct 26 2025 8:21 AM | Updated on Oct 26 2025 8:21 AM

హాజరు అంతంతే..!

హాజరు అంతంతే..!

గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చేరుకోని విద్యార్థులు దండారీ ఉత్సవాలు కొనసాగుతుండటమే కారణం గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు

కెరమెరి మండలం రాంజీగూడ గిరిజన ఆశ్రమోన్నత బాలుర పాఠశాలలో 119 మంది విద్యార్థులు చదువుతున్నారు. దసరా సెలవుల తర్వాత విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లారు. దీపావళి పండుగ దాటినా ప్రస్తుతం హాజరు శాతం అంతంత మాత్రమే ఉంది. ప్రస్తుతం పాఠశాలలో కేవలం 69 మంది ఉన్నారు. ఉపాధ్యాయులకు గ్రామాలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

వాంకిడి మండలం పెద్దపుల్లారలో విద్యార్థులతో మాట్లాడుతున్న రాంజీగూడ సీఆర్టీలు

కెరమెరి మండలం హట్టి గిరిజన ఆశ్రమోన్నత బాలుర పాఠశాలలో 356 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దసరా సెలవులకు ఇళ్లకు వెళ్లిన గిరిజన విద్యార్థులు ఎక్కువ మంది దండారీ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీంతో ప్రస్తుతం పాఠశాలలో కేవలం 173 మంది మాత్రమే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు ఇలాగే ఉంది.

కెరమెరి(ఆసిఫాబాద్‌): దసరా సెలవులు ముగిసి దాదాపు 20 రోజులు దాటింది. ఆ తర్వాత దీపావళి పర్వదినం కూడా ముగిసింది. అయినా జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు తరచూ ఫోన్లు చేస్తున్నా అనుకున్న రీతిలో స్పందన రావడంలేదు. దీంతో ప్రతిరోజూ విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులు అరకొరగా ఉన్న పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడికి రావాలని అవగాహన కల్పిస్తున్నారు.

13,126 మంది విద్యార్థులు

జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు 332 ఉండగా, ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 46 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 13,126 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆశ్రమోన్నత పాఠశాలల విద్యార్థులకు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగల కోసం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెప్టెంబర్‌ 21 నుంచి ఈ నెల 3 వరకు సెలవులు ప్రకటించింది. సెలవుల కంటే ముందు ఒకటి, రెండు రోజుల ముందే విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ నెల 4న పాఠశాలలు పునఃప్రారంభం కాగా, ఆ రోజే విద్యార్థులు యథావిధిగా తరగతులకు హాజరుకావాల్సి ఉంది. కానీ నాలుగు రోజుల క్రితం వరకు హాజరు 40 శాతం కూడా దాటలేదు. రెండు రోజులుగా కొంతమంది వస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చిన తర్వాత పిల్లల కోసం ఆయా గ్రామాలకు వెళ్తున్నారు. పిల్లలను బడికి పంపించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు.

‘గిరి’ గ్రామాల్లో దండారీ ఉత్సవాలు

ఆశ్రమ పాఠశాలల్లో చదివే వారిలో ఆదివాసీ విద్యార్థులే అధికంగా చదువుకుంటున్నారు. దీపావ ళి పండుగ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో ఈ నెల 15 నుంచి దండారీ ఉత్సవాలు ప్రారంభమయ్యా యి. ఏడాదికి ఒక్కసారి నిర్వహించే ఉత్సవాలను ఆదివాసీలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నా రు. ఇంటిల్లిపాది భాగస్వాములవుతున్నారు. ఈ ఏడాది ఉత్సవాల్లో విద్యార్థులు కూడా పాలుపంచుకుంటున్నారు. దీంతో పాఠశాలలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే 20 రోజులకు పైగా విద్యార్థులు బడికి దూరంగా ఉన్నారు. గైర్హాజరు ప్ర భావం ఎక్కువగా పదో తరగతి విద్యార్థులపై పడుతోంది. ఈ నెల 24 నుంచి ఎస్‌ఏ1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొన్ని గ్రామాల్లో దండారీ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆదివారం తర్వాత హాజరు పెరిగే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement