ఆదర్శం.. ‘చారిగాం’
ఒక్కతాటిపై నడుస్తాం
గ్రామంలో అందరం ఒక్కతాటిపై నడుస్తాం. ఏ సమస్య వచ్చినా ఒక్కచోట చేరి చర్చించుకుంటాం. మద్యంపానం, గుడుంబా తయారీని ఏళ్ల క్రితమే నిషేధించాం. ఇక్కడ ఎవ్వరూ కూడా గుడుంబా తయారు చేయరు.. తాగరు. గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో నిత్యం పూజలు నిర్వహిస్తాం.
– మొర్ల పోచయ్య, చారిగాం
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణానికి కూతవేటు దూరంలో కాగజ్‌నగర్ మండలం చారిగాం గ్రామం గు డుంబా నిషేధంలో ఆదర్శంగా నిలుస్తోంది. పూ ర్వీకుల నుంచి వారు నిషేధాన్ని పాటిస్తున్నారు. గ్రామంలో సుమారు 234 మంది నివాసం ఉంటున్నారు. గ్రామంలో గుడుంబా తయారీ చేయొద్దని.. బెల్టుషాపులు నిర్వహించొద్దని పెద్దలు తీర్మానం చేశారు. దానిని ఇప్పటికీ యువకులు కొనసాగిస్తున్నారు. స్థానికులు ప్రధానంగా కూరగాయలు పండిస్తూ పట్టణంలో విక్రయించి జీవనం సాగిస్తున్నారు. స్థానిక యువకులు ఎవరైనా బయట తాగినట్లు తెలిస్తే ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి మాలధారణ చేయిస్తున్నారు. అధ్యాత్మిక చింతనతో మరోసారి మద్యం జోలికి వెళ్లకుండా అవగాహన కల్పిస్తున్నారు.
ఆదర్శం.. ‘చారిగాం’


