
అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు వద్దు
ఆసిఫాబాద్: అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయవద్దని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చర్యల్లో భాగంగా వైల్డ్ లైఫ్, టాస్క్‌ఫోర్స్ టీం, విద్యుత్ అధికారులతో గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవాల్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ అనుమతి లేకుండా అటవీప్రాంతంలో విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రిజర్వ్ ఫారెస్టులో ఉన్న విద్యుత్ వైర్లు తొలగించి, రెవెన్యూ భూముల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమతి లేకుండా వేస్తున్న తీగలతో అటవీ జంతువులతోపాటు మనుషులు కూడా మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో అటవీ మండల అధికారి సుశాంత్ సుఖ్‌దేవ్, డీఎస్పీ వహిదుద్దీన్, అటవీ టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు ముసవీర్, సద్దాం, సీఐలు రవీందర్, రాణాప్రతాప్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషారావు, సిబ్బంది పాల్గొన్నారు.