
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
దండేపల్లి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మే రకు మండలంలోని గుడిరేవు గ్రామానికి చెంది న పూసాల రాజు (36) ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్య రాజేశ్వరితో గొడవపడటంతో రెండు రోజుల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన రాజు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం చిట్టీడబ్బులకోసం వెళ్లిన వ్యక్తి చూడగా ఉరేసుకుని కని పించాడు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.