
33వ రోజుకు కార్మికుల సమ్మె
ఉట్నూర్‌రూరల్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఐటీడీఏ కార్యాలయం ఎదుట కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. మంగళవారం గిరిజన సంఘాలు, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు మాట్లాడుతూ సమ్మె చేపట్టి 33 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన వారిలో కొలాం సేవా సంఘం రాష్ట్ర అఽ ద్యక్షుడు కొడప సోనేరావు, కుంర రాజు, భీంరావు, సంజయ్, విజయ్, బీఆర్‌ఎస్ నాయకులు కొమ్ము విజయ్, కాటం రమేశ్, ధరణి రా జేశ్, బాజీరావు, దావుల రమేశ్ ఉన్నారు.