
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
చింతలమానెపల్లి: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల ని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నా రు. మండలంలోని దిందా వాగు ఉధృతిని గు రువారం పరిశీలించారు. వంతెన వద్ద పరిస్థితిని సమీక్షించారు. వాగులోకి ఎవరూ దిగకుండా, దాటే ప్రయత్నం చేయకుండా చూడాలని ఆదేశించారు. వంతెన వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. మండలంలోని గ్రామాల పరిస్థితిని తహసీల్దార్ దౌలత్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆర్‌ఐ విజయ్, తదితరులు ఉన్నారు.