
జీవో 49 రెఫరెండంగా ఎన్నికలకు వెళ్దాం
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు
కాగజ్‌నగర్‌టౌన్: జీవో 49 రెఫరండంగా తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామని కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే హరీశ్‌బాబు కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. పట్టణంలోని తన నివాసంలో గురువారం మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారి భాష మార్చుకోవాలన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. జీవో 49పై కనీస సమాచారం లేకుండా మాట్లాడడం దారుణమన్నారు. గెజిట్ రద్దు చేసే వీలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ విషయంలో అటవీ అధికారులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ప్రత్యుత్తరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం జీవోను నిలుపుదల చేసిందని, తాము శాశ్వత పరిష్కారం దిశగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. జీవో రద్దుకు కాంగ్రెస్ నాయకులు సైతం కృషి చేయాలని హితవు పలికారు.