
నాణ్యమైన విద్య, భోజనం అందించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని వంకులం ప్రభు త్వ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గది, వంటశాల, ఆహారం నాణ్యత, హాజరు పట్టిక, పాఠశాల పరిసరాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. బడి వయస్సు పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాలు పరీక్షించారు. అయితే పాఠశాలలో పలువురు విద్యార్థులు యూనిఫాంలో లేకపోవడంపై కలెక్టర్ ఆరా తీశారు. పునఃప్రారంభం రోజునే యూనిఫాంలు పంపిణీ చేయాలని ఆదేశాలు ఉన్నా విద్యార్థులకు అందించలేదు. దీనిపై నిర్లక్ష్యం వహించిన ఐకేపీ ఏపీఎం వెంకటరమణ శర్మతో పాటు సీసీ రాజేశ్వరీపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం మండలంలోని కై రిగాంలో గల పల్లె దవాఖానాను తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి, క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో ఆశ కార్యకర్తలతో కలిసి పర్యటించాలన్నారు. ప్రతీ ఇంటిని సందర్శించి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించాలని సూచించారు. కార్యక్రమాల్లో డీఎంహెచ్‌వో సీతారాం, తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంఈవో వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అధికారులు పాఠశాలలను సందర్శించాలి
ఆసిఫాబాద్‌రూరల్: అధికారులు ప్రతిరోజూ ఒక పాఠశాలను సందర్శించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ఎంఈవోలు, ఏపీఎంలతో సమావే శం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు. ఉపాధ్యాయులు లేనిచోట సర్దుబాటు చేయాలన్నారు. రెండో విడత యూనిఫాం పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే