
విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దు
కెరమెరి(ఆసిఫాబాద్): వసతిగృహాల్లోని విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దుని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, పరిసరాలు పరిశీలించారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజల కు జాగ్రత్తలు వివరించాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. అనంతరం మోడి బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులు చెప్పే విషయాలను ఏకాగ్రతతో వినాలని సూచించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. హరితవనంలో మొక్కలు నా టారు. కార్యక్రమంలో ఎంఈవో ఆడే ప్రకాశ్, తహసీల్దార్ భీమయ్య, ఏడీఏ వెంకట్, ఎంపీడీవో అంజద్‌పాషా, ఏఈ నజీమోద్దీన్, హెచ్‌ఎం ప్రేందాస్ తదితరులు పాల్గొన్నారు.