
‘ఇంచు జాగా వదిలిపెట్టం’
కెరమెరి(ఆసిఫాబాద్): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 14 గ్రామాలు విలీనం చేసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని, ఇంచు జాగా కూడా వదిలిపెట్టమని కెరమెరి మండల బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడారు. సుప్రీం కోర్టులో సరిహద్దు గ్రామాలపై కేసు కొనసాగుతుండగా మహారాష్ట్ర సీఎం, రెవెన్యూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, వైస్ ఎంపీపీ అబ్దుల్ కలాం, పార్టీ మండల అధ్యక్షుడు అంబాజీ, నాయకులు యూనుస్, రూప్‌లాల్, రాజయ్య, జగన్నాథ్‌రావు, జాహెద్ పాల్గొన్నారు.