
ప్రాణాలు కాపాడి.. కుటుంబ సభ్యులకు అప్పగించి
లోకేశ్వరం: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని బ్లూకోల్ట్ సిబ్బంది కాపాడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన పుసవర్ల శ్రీనివాస్ మంగళవారం పంచగుడి వంతెన వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నానని 100కు డయల్ చేసి సమాచారం అందించాడు. వెంటనే బ్లూ కోల్ట్ సిబ్బంది సబ్ధర్ హుస్సేన్, ధన్‌రాజ్ అక్కడికి చేరుకుని అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈక్రమంలో మద్యానికి బానిసై ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.
గంజాయి కేసు నమోదు
నెన్నెల: గంజాయి సేవిస్తున్న యువకుడిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. జెండావెంకటాపూర్ గ్రామ శివారు మామిడి తోటలో గంజాయి సేవిస్తున్నాడని తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఎస్కూరి శశికుమార్‌ను దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. అతడి వద్ద నుంచి 130 గ్రాముల గంజాయి ప్యాకెట్లు లభించాయన్నారు. స్టేషన్‌కు తరలించి విచారించగా భీమారం మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి రాకేష్ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
సెల్‌ఫోన్ పేలి యువకుడికి గాయాలు
భీంపూర్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామానికి చెందిన గంగాధర్ జేబులో ఉన్న సెల్‌ఫోన్ మంగళవారం అకస్మాత్తుగా పేలడంతో స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గంగాధర్ మహారాష్ట్రలోని బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో భోరజ్ హైవే వద్ద సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో స్వల్ప గాయాల పాలైన ఆయనను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ప్రాణాలు కాపాడి.. కుటుంబ సభ్యులకు అప్పగించి

ప్రాణాలు కాపాడి.. కుటుంబ సభ్యులకు అప్పగించి