
నవోదయలో ఆటలపోటీలు
● 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి క్రీడలు ● రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి క్రీడాకారులు రాక
కాగజ్‌నగర్‌టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు చదువుతో ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం పీఈటీలు విద్యార్థులకు క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో నేషనల్ స్థాయి క్రీడల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని నవోదయ విద్యాలయాల క్లస్టర్‌స్థాయి పోటీలు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కాగజ్‌నగర్‌లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో జరగనున్నాయి.
జరుగనున్న ఈవెంట్స్
అండర్ 14, 17, 19 విభాగంలో హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. ఒక్కో క్రీడలో 6 టీంలుగా 18 జట్లు క్రీడల్లో పాల్గొనున్నాయి. గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 29, 31 తేదీల్లో కేరళలో జరిగే రీజినల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రపదేశ్, కేరళ జట్లు పాల్గొననున్నాయి.
చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సాహం
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తున్నాం. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పీఈటీలు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నెలల కిత్రం కరుణాకర్, హరీష్‌నాయక్, నిశ్విత్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు.
– రేపాల కృష్ణ, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయం, కాగజ్‌నగర్

నవోదయలో ఆటలపోటీలు