
క్రీడాపోటీలకు హాజరు కావాలని ఆహ్వానం
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని నవోదయ పాఠశాలలో ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర జవహార్ నవోదయ విద్యాలయాల క్లస్టర్‌స్థాయి పోటీలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ సోమవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబును ఆహ్వానించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రంగారెడ్డి, మెదక్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల నవోదయ విద్యాలయాల నుంచి క్రీడాకారులు రానున్నట్లు తెలిపారు. అండర్– 14, 17, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ పోటీలు ఉంటాయన్నారు.