
అర్హత లేని వైద్యం..!
దహెగాం మండలం గెర్రెలోని ఆర్‌ఎంపీ బినయ్ సర్కార్ గత నెల 22న నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లింగపల్లి శ్రీనివాస్(36)కు తెలిసీతెలియని వైద్యం అందించాడు. చికిత్స అందిస్తుండగానే శ్రీనివాస్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బాధితుడిని ఆర్‌ఎంపీ తన కారులో ఎక్కించుకుని ఓ చోట రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించాడు. 108కు సమాచారం అందించి అక్కడి నుంచి పరారయ్యాడు. శ్రీనివాస్ మృతి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని జాడె పూజ(16)కు జ్వరం రావడంతో గతేడాది ఆగస్టు 10న ఆర్‌ఎంపీ వద్ద చికిత్స అందించారు. ఆర్‌ఎంపీ సైలెన్ బాటిల్ ద్వారా కొన్ని ఇంజక్షన్లు ఇస్తుండగానే పూజ తీవ్ర అస్వస్థతకు గురైంది. భయపడిన అతడు మధ్యలోనే వైద్యం నిలిపేశాడు. కుటుంబ సభ్యులు విద్యార్థిని వెంటనే చంద్రపూర్‌కు తరలించగా అక్కడ మృతి చెందింది. ఆర్‌ఎంపీ వైద్యం వికటించి గతేడాది అదే గ్రామానికి చెందిన కాళీదాస్ అనే యువకుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు.
● రోగులకు ప్రాణ సంకటం
● క్లినిక్‌లలో ఆర్‌ఎంపీ, పీఎంపీల వైద్యం
● గాలిలో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు
● చోద్యం చూస్తున్న జిల్లా అధికారులు

అర్హత లేని వైద్యం..!

అర్హత లేని వైద్యం..!