
రేపు మల్టీపర్పస్ కేంద్రం ప్రారంభం
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండలం లింబుగూడలో ఏర్పాటు చేసిన మల్టీపర్పస్ కేంద్రాన్ని ఈ నెల 16న కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రారంభిస్తారని అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. లింబుగూడలోని మల్టీపర్పస్ కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ పీఎం జన్‌మన్ పథకం కింద బహుళార్థక ప్రయోజన కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమీప గ్రామాలకు చెందిన ప్రజలకు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి సేవలందించేందుకు ఈ కేంద్రం ఓ వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ప్రారంభోత్సవానికి ఏర్పా ట్లు జరుగుతున్నాయని తెలిపారు.