
విద్యార్థిని కుటుంబ సభ్యుల ఆందోళన
బెజ్జూర్(సిర్పూర్): మంచిర్యాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల భవనం పైనుంచి పడి చికిత్స పొందుతూ మృతి చెందిన బెజ్జూర్ మండలం మర్థిడి గ్రామానికి చెందిన కుమ్మరి స్వప్న స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శనివారం ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నాయకుడు హర్షద్ హుస్సేన్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సారయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబానికి రూ.50లక్షలు పరిహారంతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారితో తహసీల్దార్ రాంమోహన్‌రావు, కౌటాల సీఐ ముత్యం రమేశ్ మాట్లాడారు. కుటుంబంలో ఒకరికి ఔట్‌సో ర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని, మృతికి బాధ్యులైన వారిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విద్యార్థిని అంత్యక్రియలు నిర్వహించారు. కాగజ్‌నగర్ సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు ప్రవీణ్‌కుమార్, విక్రమ్, విజయ్, విజయ్, నరేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.