మీ తమ్మునిపై కేసు అయ్యింది.. | - | Sakshi
Sakshi News home page

మీ తమ్మునిపై కేసు అయ్యింది..

Jul 1 2025 4:22 AM | Updated on Jul 1 2025 4:22 AM

మీ తమ

మీ తమ్మునిపై కేసు అయ్యింది..

ఉపాధ్యాయుడికి సైబర్‌ నేరస్తుడి ఫోన్‌..

అప్రమత్తతతో తప్పించుకున్న బాధితుడు

జన్నారం: హలో.. నేను సీబీఐ నుంచి మాట్లాడుతున్నా.. మీ తమ్మునిపై కేసు నమోదైంది. మీరు వెంటనే ఆదిలాబాద్‌ రండి.. లేకుంటే చాలా ప్రమాదంలో పడుతారని ఉపాధ్యాయుడికి ఫోన్‌రావడంతో మొదట బిత్తరపోయిన ఉపాధ్యాయుడు తేరుకుని సైబర్‌ నేరస్తుడని గ్రహించి తప్పించుకున్న సంఘటన జన్నారంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం కిష్టాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ప్రకాశ్‌నాయక్‌కు ఓ వ్యక్తి ఫోన్‌చేసి నేను సీబీఐ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా.. మీ తమ్ముదు ప్రమోద్‌పై కేసు నమోదైంది. మీరు వెంటనే ఆదిలాబాద్‌కు రండి అని చెప్పాడు. మొదటగా భయాందోళనకు గురైన ఉపాధ్యాయుడు వెంటనే ఆదిలాబాద్‌లో ఉంటున్న ప్రమోద్‌కు ఫోన్‌ చేశాడు. ఎక్కడున్నావని అడుగగా గుడిలో పూజ చేస్తున్నట్లు చెప్పాడు. సదరు ఉపాధ్యాయుడు అదే నంబర్‌కు ఫోన్‌ చేసి బెదిరించడంతో సైబర్‌ నేరగాడు ఫోన్‌ కట్‌ చేశాడు. విషయాన్ని ఎస్సై అనూషకు చెప్పడంతో అలాంటి ఫేక్‌ కాల్‌లను నమ్మవద్దని సూచించారు.

సాంస్కృతికశాఖ సలహామండలి సభ్యుడిగా నాగరాజు

మందమర్రి రూరల్‌: మందమర్రి పట్టణానికి చెందిన ధూంధాం సాంస్కృతిక విభాగం వ్యవస్థాపకుడు అంతడ్పుల నాగరాజును తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యుడిగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సాంస్కృతిక మండలి సలహాదారుగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. పలువురు కళాకారులు నాగరాజును అభినందించారు.

‘9న సమ్మె విజయవంతం చేయాలి’

శ్రీరాంపూర్‌: జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నస్పూర్‌ కాలనీలోని జీటీ హాస్టల్‌ వద్ద పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ సర్కార్‌ కాలరాస్తుందన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకువచ్చి కార్మిక హక్కులను హరిస్తోందన్నారు. ఈ సమ్మెతో కేంద్రానికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ముస్కే సమ్మయ్య, బాజీ సైదా, కిషన్‌ రావు, కేతిరెడ్డి సురేందర్‌ రెడ్డి, బండి రమేశ్‌, చంద్రశేఖర్‌, వెంగళ శ్రీనివాస్‌, కిషన్‌ రెడ్డి, కాంతయ్య, సత్యం, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌ఎంఎస్‌ సమ్మె నోటీసు

జూలై 9న జరుపతలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సంబంధించిన నోటీసును హెచ్‌ఎంఎస్‌ నాయకులు శ్రీరాంపూర్‌ జీఎం ఎం.శ్రీనివాస్‌కు అందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్‌ కేంద్ర నాయకులు తిప్పారపు సారయ్య, ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, అశోక్‌, గొల్ల్ల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

మీ తమ్మునిపై కేసు అయ్యింది..1
1/2

మీ తమ్మునిపై కేసు అయ్యింది..

మీ తమ్మునిపై కేసు అయ్యింది..2
2/2

మీ తమ్మునిపై కేసు అయ్యింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement