
యువకుడి హత్య
పెంచికల్‌పేట్:పెంచికల్‌పేట్ మండలం కొండపెల్లి గ్రామానికి చెందిన దీకొండ శ్రీధర్‌చారీ(25) సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఎస్సై కొమురయ్య, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగించే శ్రీధర్‌చారీ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన పొట్టె రాజన్న ఇంటి వెనుక పెరట్లో దారుణ హత్యకు గురయ్యాడు. మారణాయుధంతో నరికి చంపినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో శ్రీధర్‌చారీని తానే హత్యచేశానని పొట్టె రాజన్న పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.