
మేమున్నామని..
వృత్తిలో తృప్తి
రోగులకు వైద్యసేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇష్టంగా ఎంచుకున్న వృత్తిలో విజయాలు సాధించినప్పుడు కలిగే ఆనందం గొప్పది. గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా విధులు నిర్వహిస్తున్నా. వైద్య వృత్తిలో తృప్తి లభిస్తోంది.
– శివకుమార్, కడెం పీహెచ్‌సీ
నమ్మకమైన సేవలు అందించాలి
అమ్మానాన్నల ప్రోత్సాహంతో వైద్య కోర్సు పూర్తిచేశా. వైద్యోనారాయణోహరి అనే నానుడిని నేడు కార్పొరేట్ ఆస్పత్రులు పూర్తిగా డబ్బులకు ఆశపడి మరిచిపోతున్నాయి. వైద్యులు రోగులకు నమ్మకమైన సేవలందించాలి. వైద్యరంగంలో రాణించాలనుకునే యువత ముందుగా ఎథికల్ ప్రాక్టీస్ చేయాలి. వైద్యులు ముఖ్యంగా మాతాశిశు మరణాలు జరగకుండా ఆపగలిగితే మనదేశం అభివృద్ధిలో మరింత ముందుంటుంది. – డాక్టర్ ప్రత్యూష, లక్ష్మణచాంద పీహెచ్‌సీ

మేమున్నామని..