
సమాజ సేవలో చంద్రదత్
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన వైద్యుడు జీవీఎంఎస్ చంద్రదత్ ఐబీ సమీపంలో ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. తరచూ ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి మందులు సైతం అందిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆస్పత్రికి వచ్చే రోగుల ఆర్థిక పరిస్థితినిబట్టి ఫీజులు తీసుకుంటున్నారు. అనవసరమైన టెస్టులు చేయకపోవడం, అవసరానికి మించి మందులు రాయడం వంటివి లేకపోవడంతో ప్రజలు నమ్మకంగా వస్తున్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ, వృద్ధాశ్రమంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించి మందులు సైతం ఉచితంగా అందిస్తున్నారు. ఆశ్రమాలకు అవసరమైన సరుకులు, నగదు అందజేస్తున్నారు. – డాక్టర్ చంద్రదత్, జనరల్ మెడిసిన్