
ఎన్‌ఐపీ చట్టాన్ని రద్దు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే ఎన్‌ఐపీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాల ని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూ నియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి త్రివేణి డిమాండ్ చేశారు. జూలై 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో అంగన్‌వాడీ ఉద్యోగులు పాల్గొననున్నట్లు మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌కు సమ్మె నోటీస్ అందించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కార్మికులు పోరాటాలతో సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లు అమలు చేస్తుందన్నారు. ఐసీడీఎస్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్, నాయకులు సువర్ణ, వనిత, అంజలి పాల్గొన్నారు.