
అనార్‌పల్లి వాగులో వరద
కెరమెరి(ఆసిఫాబాద్): గత వారంలో రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు మండలంలోని అనార్‌పల్లి వాగులో వరద మొదలైంది. మళ్లీ మంగళవారం సైతం వర్షం పడటంతో అవతలి వైపు ఉన్న కరంజివాడ, పెద్ద కరంజివాడ, జన్కాపూర్, బోరిలాల్‌గూడ, శంకర్‌గూడ తదితర పది గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు తాత్కాలిక వంతెన సైతం కొట్టుకుపోవడంతో బైక్‌లు కూడా వెళ్లడం కష్టంగా మారింది. ప్రతీ అవసరానికి కెరమెరి మండల కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా, మే నెలలోనే వరద రావడంతో ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి.