
రైతులు, అటవీ అధికారుల మధ్య వాగ్వాదం
చింతలమానెపల్లి(సిర్పూర్): మండలంలోని డబ్బా గ్రామంలో మంగళవారం అటవీశాఖ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో పోడు భూములు స్వాధీనం చేసుకోవడానికి అటవీ శాఖ అధికారులు వస్తున్నారనే సమాచారంతో రైతులు భూముల వద్దకు చేరుకుని అధి కారులను అడ్డుకున్నారు. పోడు భూములు 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని వారికి వివరించారు. ఎఫ్‌ఆర్వో ఇక్బాల్ మాట్లాడు తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అటవీ భూమి స్వాధీనం చేసుకుంటున్నామని తెలి పారు. పోడు పట్టాలు ఉన్న ఆదివాసీల భూ ములను ముట్టుకోమని స్పష్టం చేశారు. ఒక దశలో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. అనంతరం ఫారెస్టు అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.