
తెగిన గుండి వాగు తాత్కాలిక వంతెన
ఆసిఫాబాద్‌రూరల్: మండలంలోని గుండి వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ప్రతీ సంవత్సరం ఎండాకాలం వాగులో పైపులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసి రాకపోకలు కొనసాగిస్తుంటారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులో నీటి ప్రవాహం ఎక్కువై వంతెన పైనుంచి నీరు ప్రహిస్తోంది. అదే గ్రామానికి చెందిన జాడి సంతోష్ ఉదయం 6 గంటలకు తన ఆటోలో ఆసిఫాబాద్ వెళ్లేందుకు వంతెన దాటుతుండగా ఒక్కసారిగా వంతెన కుంగిపోయింది. నీటి ప్రవాహంలో ఆటో కొంతమేర కొట్టుకుపోగా ట్రాక్టర్ సాయంతో గ్రామస్తులు ఆటోను బయటకు తీశారు. కాగా ప్రస్తుతం గుండి గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు.