
తడిసిన ధాన్యం కొనాలి
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ● కౌటాల– కాగజ్‌నగర్ రహదారిపై రాస్తారోకో
రోడ్డెక్కిన రైతులు
సిర్పూర్(టి)/చింతలమానెపల్లి: ధాన్యం కొనుగోలు చేయాలని శుక్రవారం రైతులు రోడ్కెక్కారు. సిర్పూర్(టి) మండలంలోని పారిగాం గ్రామస్తులు సిర్పూర్(టి)– కౌటాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌లో వరిధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి రైతులు ఆందోళన నిర్వహించారు. ఆరు రోజులుగా రవీంద్రనగర్ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని తెలిపారు. కాంటా చేయకపోవడంతో నిల్వ ఉంచిన వడ్లు వర్షానికి తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కౌటాల(సిర్పూర్): అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు డిమాండ్ చేశారు. కొనుగో ళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కౌటాల– కాగజ్‌నగర్ ప్ర ధాన రహదారిపై ముత్తంపేట వద్ద తడిసిన ధాన్యాన్ని పోసి శుక్రవారం రైతులు చేపట్టిన రాస్తారోకోకు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీ ఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తడిసిన ధాన్యాన్ని కొంటామని చెబుతున్నారని, ఇక్కడమో తప్ప, తాలు, తేమ పేరిట తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. పంట చేతికొచ్చి నెల రోజులవుతుందని, ధాన్యం సేకరించాలని జిల్లా అధికారులకు సూచించినా పట్టించుకోకపోవడంతోనే అన్నదాతలకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ డేవిడ్ రాస్తారోకో చేస్తున్న రైతుల ధాన్యాన్ని పరిశీలించారు. 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నామని, కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్మకై రై తులను ముంచుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌బాబు సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్‌తో సెల్‌ఫోన్‌లో మాట్లాడి తడిసిన ధాన్యం కొనాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లో కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. నాలుగు గంటలపాటు వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. బీజేపీ జిల్లా కార్యదర్శి రాజేందర్‌గౌడ్, నాయకులు మల్లయ్య, మోతీరాం, తిరుపతి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

తడిసిన ధాన్యం కొనాలి