
ఇంటర్ ప్రవేశాలకు వేళాయె
● ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు ● ఈ నెల 31 వరకు దరఖాస్తులకు ఆహ్వానం
ఆసిఫాబాద్‌రూరల్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు మొదలయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు ఫలితాల్లో ప్రైవేట్ కంటే దీటుగా నిలుస్తున్నారు. ఏటా మెరుగైన ఉత్తీర్ణతతో విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ప్రైవేట్ కంటే ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు.
కళాశాలల వారీగా సీట్లు ఇలా...
జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 11 ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్ గ్రూప్‌లు ఉండగా ఒక్కో గ్రూప్‌లో 88 మంది వరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. 11 కళాశాలల్లో అన్ని గ్రూప్‌లు కలిపి 4,200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 13 కేజీబీవీలు 7 కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీలో ఒక్కో గ్రూప్‌లో 40 చొప్పున 560 సీట్లు, 6 కళాశాలల్లో సీఈసీ, హెచ్‌ఈసీలో ఒక్కో గ్రూప్‌లో 40 చొప్పున 480 సీట్లకు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. 2 తెలంగాణ మోడల్ స్కూల్, కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌లు ఉండగా ఒక్కో గ్రూప్‌లో 40 చొప్పున 320 సీట్లు భర్తీ చేయనున్నారు. 4 సాంఘిక సంక్షేమ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ ఒక్కో గ్రూప్‌లో 40 మంది విద్యార్థుల చొప్పున 320 సీట్లు ఉన్నాయి. 5 గిరిజన బాలికల కళాశాలల్లో ఒకటి బాలురు, నాలుగు బాలికల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఒకేషనల్ గ్రూప్‌లో 460 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2 మైనార్టీ గురుకుల కళాశాలల్లో బాలికలు, బాలురు ఎంపీసీ, బైపీసీ ఒక్కో గ్రూప్‌లో 40 చొప్పున 160 సీట్లు, 5 జ్యోతిబా పూలే గురుకుల కళాశాలల్లో మూడు బాలురు, రెండు బాలికల కళాశాలల్లో 400 సీట్ల భర్తీకోసం ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల పక్రియ కొనసాగుతోంది.
ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. పదోతరగతి పాసైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా లేదంటే నేరుగా కళాశాలకు వెళ్లి తమకు నచ్చిన గ్రూప్‌లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉంది.
– కళ్యాణి, డీఐఈవో
నాలుగేళ్లుగా ఇంటర్ ఫలితాలు ఇలా..
విద్యా హాజరైన ఉత్తీర్ణులు ఉత్తీర్ణత శాతం రాష్ట్రస్థాయిలో సంవత్సరం విద్యార్థులు ర్యాంకు
2021–22 ఫస్ట్ ఇయర్ 5,252 3,716 70 03
సెకండ్ ఇయర్ 4,826 3,678 76 02
2022–23 ఫస్ట్ ఇయర్ 5,137 3,748 74 03
సెకండ్ ఇయర్ 4,697 3,793 81 02
2023–24 ఫస్ట్ ఇయర్ 4,570 2,813 61 08
సెకండ్ ఇయర్ 4,095 2,951 81 07
2024–25 ఫస్ట్ ఇయర్ 4,756 3,354 70.52 04
సెకండ్ ఇయర్ 4,920 3,948 80.24 02
జిల్లాలో 48 కళాశాలలు...
జిల్లాలో మొత్తం 48 కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వరంగ కళాశాలలు 42, ప్రైవేట్ కళాశాలలు 6 ఉన్నాయి. ఇందులో 11 ప్రభుత్వ జూని యర్ కళాశాలలు కొన్నేళ్లుగా ప్రైవేట్‌ను మించి ఉత్తీర్ణత నమోదు చేస్తున్నాయి. వార్షిక పరీక్షల్లో మూడేళ్లగా జిల్లా టాప్ త్రీలో నిలుస్తోంది. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలకు పంపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు, పరీక్షలకు కొన్ని నెలల ముందు నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ఇంటర్ ప్రవేశాలకు వేళాయె