రామదాసు మందిరంలో కంచి పీఠాధిపతి | - | Sakshi
Sakshi News home page

రామదాసు మందిరంలో కంచి పీఠాధిపతి

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

నేలకొండపల్లి: కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి నేలకొండపల్లి భక్తరామదాసు మందిరాన్ని మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత స్వామికి పూజారి, భక్తులు స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆయన ఆశీర్వచనాలు అందజేసి అనుగ్రహ భాషణం చేశారు.

బీఏఎస్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మంమయూరిసెంటర్‌: బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల(రెసిడెన్షియల్‌, నాన్‌ రెసిడెన్షియల్‌)లో 1, 5వ తరగతుల్లో ప్రవేశానికి అర్హులైన షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థినీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ డీడీ జి.జ్యోతి తెలిపారు. ఒకటో తరగతి(నాన్‌ రెసిడెన్షియల్‌ / డే స్కాలర్స్‌)లో 128 సీట్లు, 5వ తరగతి(రెసిడెన్షియల్‌) లో 131 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. కుటుంబ వార్షిక ఆదా యం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లోనైతే రూ.2 లక్షల లోపు ఉండాలని, డిగ్రీ, అంత కంటే ఎక్కువ చదువుకున్న వారి పిల్లలు అనర్హులని స్పష్టం చేశారు. ఒక కుటుంబం నుంచి ఒకరికే అర్హత ఉంటుందని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ ఉపకులాల వారీగా కేటగిరీ–1కు ఒక శాతం, కేటగిరీ–2కు 9శాతం, కేటగిరీ–3కు ఐదు శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. విద్యార్థులు జూన్‌ 6వ తేదీలోగా కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో అన్ని ధ్రువపత్రాలు జత చేసిన దరఖాస్తులు సమర్పించాలని డీడీ సూచించారు.

అటవీ శాఖలో

38 మంది బదిలీ

21, 22వ తేదీల్లో సర్కిల్‌ స్థాయిలో ట్రాన్స్‌ఫర్లు

ఖమ్మంవ్యవసాయం: సాధారణ బదిలీల్లో భా గంగా జిల్లా అటవీ శాఖ పరిధిలో 38 మంది ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. జిల్లా అట వీ శాఖాధికారి అనూజ్‌ అగర్వాల్‌ ఆధ్వర్యాన నిర్వహించిన ప్రక్రియలో సభ్యులుగా ఖమ్మం, సత్తుపల్లి డివిజన్ల అధికారులు కృష్ణప్రసాద్‌, మంజుల, వరంగల్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎఫ్‌డీఓ చంద్రశేఖర్‌ వ్యవహరించారు. ఈమేరకు అర్హతలు, నిబంధనల ఆధారంగా 38మంది ఉద్యోగులను జిల్లా పరిధిలో బదిలీ చేశారు. ఇందులో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు(ఎఫ్‌బీఓ) 28 మంది, జూనియర్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ సబార్డినేట్లు ఐదుగురు చొప్పున ఉన్నారు. ఇక భద్రాద్రి అటవీ సర్కిల్‌ పరిధిలో బదిలీల ప్రక్రియ ఈనెల 21, 22వ తేదీల్లో వరంగల్‌ సీసీఎఫ్‌ కార్యాలయంలో జరగనుంది. ఆ సమయాన సెక్షన్‌ ఆఫీసర్లు, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్స్‌ స్థాయి ఉద్యోగుల కౌన్సెలింగ్‌, బదిలీ ఉంటుంది.

పశు వైద్య శాఖలో 21 మంది....

జిల్లా పశువైద్య, పశు సంవర్థక శాఖ పరిధిలో మంగళవారం 21మంది ఉద్యోగులను బదిలీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 21 మంది ఆఫీస్‌ సబార్డినేట్ల బదిలీకి, జిల్లా పశు సంవర్థక, పశువైద్యాధికారి బోడేపూడి పురంధర్‌ ఆధ్వర్యాన కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

ఢిల్లీలో అంతర్జాతీయ డ్యామ్‌ సేఫ్టీ సదస్సు

ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు సీఈల హాజరు

ఖమ్మంఅర్బన్‌: ‘డ్యామ్‌ సేఫ్టీ, రిజర్వాయర్ల పరిరక్షణ’ తదితర అంశాలపై ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉమ్మడి జిల్లాకు చెందిన జలవనరుల శాఖ సీఈలు ఇద్దరు పాల్గొన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సీఈలు మంగళపూడి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి సదస్సుకు హాజరయ్యారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో డ్యామ్‌ల భద్రత, రిజర్వాయర్ల పరిరక్షణ, నీటి నిల్వల నిర్వహణ, అత్యవసర సమయాల్లో నీటి సంరక్షణ చర్యలు, విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగు పరిచే విధానాలపై నిపుణులు అవగాహన కల్పించారు. అలాగే, డ్యామ్‌ల భద్రతకు సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముందస్తు జాగ్రత్తలు, విపత్తు నిర్వహణ చర్యలపైనా చర్చించారు. తెలంగాణ తరఫున పాల్గొన్న సీఈలు ఇద్దరు రాష్ట్రంలోని రిజర్వాయర్ల నిర్వహణకు సంబంధించి అంశాలను సదస్సులో వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement