జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు
● జిల్లాలో గరిష్టంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత ● వేడితో అల్లాడిపోతున్న ప్రజలు
ఖమ్మంవ్యవసాయం: భానుడు భగ్గుమంటున్నాడు. వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించినట్లుగానే జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం జిల్లాలో 31.9 – 43.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మంగళవారం 41.3 – 44.8 డిగ్రీలకు చేరడం గమనార్హం. ప్రస్తుతం 40–45 డిగ్రీల మధ్య అప్రమత్తత స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుండగా, ఉదయం 9 గంటల నుంచే ప్రభావం మొదలై 11 గంటలకల్లా తీవ్ర స్థాయికి చేరుతోంది.
ప్రజల ఇక్కట్లు
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండ, వడగాలుల ప్రభావం కొనసాగుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. పగటి పూట ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అలాగే, పిల్లలు, వృద్ధులు నీరసించిపోతున్నారు. ఇక రైతులు, వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు ఉదయం, సాయంత్రం మాత్రమే పని చేస్తున్నారు. ఎండలు, వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యం, వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ప్రాంతం ఉష్ణోగ్రత
(డిగ్రీల్లో)
తిమ్మారావుపేట 44.8
పమ్మి, గుబ్బగుర్తి 44.5
బాణాపురం 44.2
కలెక్టరేట్ 43.9
వైరా, నేలకొండపల్లి 43.8
కాకరవాయి 43.7
ప్రకాష్‌నగర్, కూసుమంచి 43.6
ఖానాపురం 43.5
ఎర్రుపాలెం, మధిర 43.4
తల్లాడ, రావినూతల 43.2
బచ్చోడు, కుర్నవల్లి 43.1
కొణిజర్ల 43


