● రోజురోజుకూ ౖపైపెకి బీర్ల విక్రయం ● బార్లు, వైన్స్‌లకు ఐదు నెలల్లో రూ.177 కోట్ల విలువైన సరుకు ● ఎండ వేడికి తోడు ఐపీఎల్‌తో డిమాండ్
వైరా: ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఏ రోజూ 40డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ప్రజలు వేసవి తాపం నుండి సేదతీరేందుకు శీతల పానీయాలు, కొబ్బరి బొండాలు, చెరుకు రసం వంటివి సేవిస్తున్నారు. ఇదే సమయాన మందుబాబులు మాత్రం బీర్లపైనే మక్కువ కనబరుస్తున్నారు. జనవరి 1వ తేదీ నుండి ఈనెల 19వ తేదీ వరకు వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి ఉమ్మడి జిల్లాలోని బార్లు, వైన్స్‌లకు రూ.177.45 కోట్ల విలువైన 8.73 లక్షల కేసుల బీర్లు తీసుకెళ్లారంటే ఎంత మేర డిమాండ్ ఉందో అర్థమవుతుంది.
మ్యాచ్ చూస్తూ చిల్ అవుతూ..
బార్లు, వైన్స్‌ల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు అమర్చి మందుబాబుల కోసం ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రదర్శిస్తున్నారు. దీంతో నిత్యం వెళ్లే వారు కాకుండా యువకులు సైతం చేరుకుని బీర్లు తాగుతూ.. మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదునుగా భావించిన బార్లు, వైన్స్ నిర్వాహకులు బీర్లపై ఎంఆర్‌పీకి అదనంగా మరో రూ.40 జోడిస్తున్నారని సమాచారం. ఈ విషయమై ఎకై ్సజ్ శాఖ అధికారులు తనిఖీలు చేయడమైతే ఎక్కడా చోటు చేసుకోలేదు. రానున్న రోజుల్లో ఎండలు పెరిగితే బీర్లకు మరింత డిమాండ్ పెరుగుతుందనే అంచనాల నేపథ్యాన ధరల కట్టడిపై దృష్టి సారించాలని బీరు బాబులు కోరుతున్నారు.


