‘ట్రెసా’ నూతన కార్యవర్గం ఎన్నిక
● అధ్యక్ష, కార్యదర్శులుగా సునీల్‌రెడ్డి, ప్రసాద్
ఖమ్మంసహకారనగర్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్‌ఈఎస్ ఏ–ట్రెసా) జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఖమ్మం డీపీఆర్‌సీ భవనంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా తుంబూరు సునీల్‌రెడ్డి, కార్యదర్శిగా కేవీవీ.ప్రసాద్, గౌరవ అధ్యక్షులుగా తుమ్మా రవీందర్, రాచకొండ సాయినరేష్ ఎన్నికయ్యారు. అలాగే, కోశాధికారి గా మిరియం క్రాంతికుమార్, వివిధ విభాగాల కార్యదర్శులుగా కె.శ్రీకాంత్, సతీష్, రంజిత్‌కుమార్, జగదీష్, ఎం.ఎస్.గౌతమ్, ఉపాధ్యక్షులుగా వెంకన్న, కిరణ్‌కుమార్, జాస్మిన్, రమేష్, రమణి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, అన్సారి, రవికుమార్, సంయుక్త కార్యదర్శులుగా ఎస్‌కే.అజీజ్, ఏ.మధు, అశోక్‌ను ఎన్నుకున్నారు. అంతేకాక కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ్‌కుమార్, ఏకవీర, నరసింహారావు, నళిని, శ్రావణ్‌కుమార్, ఉషారాణి, నాగరాజు ఎన్నిక కాగా, నూతన కార్యవర్గాన్ని జేఏసీ చాంబర్ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, టీఆర్‌ఈఎస్‌ఏ ఉపాధ్యక్షుడు కారుమంచి శ్రీనివాసరావు, రాష్ట్ర కోశాధికారి బి.వెంకటేశ్వరరావు తదితరులు అభినందించారు.
రేపటి నుంచి ప్రజావాణి
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల కారణంగా ఇన్నాళ్లు వాయిదా వేసిన ప్రజావాణి(గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని ఈ సోమవారం నుంచి కలెక్టరేట్‌లో యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయొచ్చని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.


