ఆకట్టుకున్న సైన్స్‌ఫేర్
జిల్లాస్థాయి సైన్స్ ఫేర్, ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్ బల్లేపల్లిలోని ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాలలో శనివారం మొదలయ్యాయి. సైన్స్‌ఫేర్‌కు 743 ఎగ్జిబిట్లు, ఇన్‌స్పైర్‌కు 100 ప్రదర్శనలు ఏర్పాటు చేయడం.. వీటిని చూసేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులు రావడంతో స్కూల్ ఆవరణ కళకళలాడింది. కాగా, కొందరు విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు అబ్బురపరిచేలా ఉండడం విశేషం. దూరదృష్టితో ఆలోచించి కొందరు, కళ్ల ముందు చూసిన సమస్యలకు పరిష్కారంగా ఇంకొందరు తయారు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించిన వక్తలు, న్యాయనిర్ణేతలు అభినందించారు. వారు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
– ఖమ్మంసహకారనగర్
●శాటిలైట్ల పనివిధానం..
సత్తుపల్లి కేపీఆర్ గౌతమ్ స్కూల్‌కు చెందిన బి.హానిశ్‌కుమార్‌నాయక్ ఇస్రో ప్రయోగించే శాటిలైట్ల పని విధానంపై ఎగ్జిబిట్ ప్రదర్శించాడు. భవిష్యత్‌లో శాస్త్రవేత్తగా ఎదగాలన్నదే తన లక్ష్యమని వెల్లడించాడు. ఇందులో భాగంగానే శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తితో ఇస్రో శాటిలైట్ల పనితీరుపై ఎగ్జిబిట్ రూపొందించానని చెప్పాడు.
●మల్టీపర్పస్ క్రాప్ ప్రొటెక్టర్
కొణిజర్ల జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఆర్.హిమాసాగర్ మల్టీపర్పస్ క్రాప్ ప్రొటెక్టర్ ప్రదర్శిచాడు. అటవీ జంతువుల నుంచి పంటలకు రక్షణ కోసం ఈ పరికరం ఉపయోగపడుతుందని వెల్లడించారు. పగటి సమయంలో శబ్దంతో జంతువులు పారిపోతాయని, రాత్రి వేళ సోలార్ సిస్టమ్ ద్వారా వెలిగే లైట్‌తో క్రిమికీటకాలు దరిచేరవని వెల్లడించాడు.
ఆకట్టుకున్న సైన్స్‌ఫేర్
ఆకట్టుకున్న సైన్స్‌ఫేర్


